ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు

అమరావతి :

ఏపీలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్ ప్రోగ్రామ్) బాధ్యతలను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ప్రతి ఉద్యోగికి సగటున 3 క్లస్టర్లును కేటాయించింది. 1,08,311 మంది 2.14 లక్షల క్లస్టర్లలోని 21.56 లక్షల బంగారు కుటుంబాల
బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. మార్గదర్శులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ బంగారు కుటుంబాలకు సాయం అందేలా చూడాలి.