గ్రీన్ వాల్” కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంతాల్లో “గ్రీన్ వాల్” కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పర్యావరణ పరిరక్షణకు, తీర ప్రాంత భద్రతకు ఒక పెద్ద అడుగు. దీనికి తోడు భారత ప్రభుత్వం ప్రకటించిన #MISHTI ప్రోగ్రాం ద్వారా ఉండే మడ అడవుల అభివృద్ధి, రక్షణ కార్యక్రమం మరింత ముందంజ వేస్తున్నది.

ముఖ్య లక్ష్యాలు:

2029 నాటికి ఆకుపచ్చ కవచం 30% నుంచి 37%కి పెంపు లక్ష్యం.

2047 నాటికి 50% హరిత కవచం (Green Cover) సాధించడం

తీరప్రాంతాల్లో మడలు, తాటి, జమ్మి చెట్లు వ్యాప్తి చేసి, “గ్రీన్ వాల్” ద్వారా తీరరేఖకు రక్షణ.

దీని ప్రయోజనాలు:

  • వాతావరణ మార్పులను తగ్గించడం, తీరప్రాంత భద్రతను మెరుగుపరచడం.
  • స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వనరుల రక్షణ.
  • MISHTI పథకం కింద 700 హెక్టార్లలో కొత్త మడ అడవులను అభివృద్ధి చేయడానికి పునాది.

సవాళ్లు
పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నిజాయితీగా ఉంటే చాలదు మొత్తం యంత్రాంగం గ్రామస్థాయి, జిల్లా స్థాయి అధికారుల నిజాయితీ, కృషి కూడా కీలకం.

నిరంతర క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఉంటేనే కేంద్ర/ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరతాయి

లేదంటే, అలాంటి అభివృద్ధి ప్రయత్నాలు ప్రశ్నార్థకమవుతాయి; దళారులకు ఉపాధి హామీ పథకంగా మాత్రమే మిగిలిపోతాయి.

అధికార, ప్రజల జవాబుదారి తనంతో నిజమైన నిరంతర పర్యవేక్షణతో ఈ పథకం విజయవంతం చేయాల్సిన అవసరం మాత్రమే కాదు అందరి భాద్యత కూడా..

పర్యావరణాన్నిపరిరక్షించేఅభివృద్ధి_ప్రస్థానం JanaSena Party సిద్ధాంతం..