అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం

భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor…అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే పత్రాన్ని పంపేలా కసరత్తు చేస్తోంది. కొద్దిరోజులుగా చాలామంది మొబైల్స్‌కు..

‘మీరు ఇంటిగ్రేటెడ్‌ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు.. అది మాకు అందింది. ఈ దరఖాస్తుపై సుమోటో విచారణ జరుగుతోంది.. 25 రోజుల్లోపు ప్రాసెస్‌ పూర్తవుతుంది.. గవర్నమెంట్‌ ఏపీ ‘ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. అసలు దరఖాస్తు చేయకుండా ధ్రువీకరణ పత్రం ఏంటని కొందరు అవాక్కయ్యారు.. ఆ తర్వాత అసలు విషయం ఏంటో తెలుసుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఈ కొత్త ఆలోచన చేసింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం వస్తుంది. చదువు, ఉపకార వేతనాలు, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఈ పత్రం ఉపయోగపడుతుంది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సచివాలయం, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రెవెన్యూ శాఖ ఈ పనిని సులభతరం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కుటుంబాల సర్వేలో వివరాలు సేకరించగా.. వాటి ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక వీఆర్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి.. వారు కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు అర్హులా.. కాదా? అనే అంశంపై సర్వే చేపట్టారు.