భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో ఇకపై గిరిజనులకూ 14.2 కేజీల సిలిండర్!
అమరావతి :
📍ఏపీలో ‘దీపం-2’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఇక నుంచి 14.2 కేజీల LPG సిలిండర్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వారికి 5kgs సిలిండర్లను ఇస్తుండగా, వాటి స్థానంలో 14.2kgs సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంటేషన్ ఛార్జీల కోసం రూ.5.54కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో 23,912 మందికి లబ్ది చేకూరనుంది.
