భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు శిక్ష
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు కు చెందిన గంజి ఏడుకొండలకు ఒంగోలు మొబైల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు మంగళవారం జైలు శిక్ష విధించారు. ఏడుకొండలు తన అవసరాల నిమిత్తం ఒంగోలుకు చెందిన నంబూరి సుబ్బారావు వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించ క్రమంలో చెల్లని చెక్కును ఏడుకొండలు ఇచ్చాడు. సుబ్బారావు, ఏడుకొండలకు నోటీసులు పంపారు. అయినా స్పందించకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారించిన ఒంగోలు మొబైల్ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు బాధితుడికి రూ.7.50 లక్షలు తిరిగి చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది. అంతేకాకుండా నిందితుడికి కోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.
