NEPAL: పార్లమెంట్ భవనానికి నిప్పు

భారత్ న్యూస్ ఢిల్లీ…..NEPAL: పార్లమెంట్ భవనానికి నిప్పు

📍నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని పార్లమెంట్ భవనానికి ఆందో ళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఆ భవనం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా అక్కడ హింసాత్మక ఘటనలు ఆగట్లేదు. ఇప్పటికే ప్రధాని సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు.

📍 నేపాల్ ప్రధాని రాజీనామా

నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.