ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతీ SC, ST, కుటుంబాన్ని OC జాబితాలో చేర్చాల్సిందే – JP (జయప్రకాశ్ నారాయణ మాజీ IAS)

భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతీ SC, ST, కుటుంబాన్ని OC జాబితాలో చేర్చాల్సిందే – JP (జయప్రకాశ్ నారాయణ మాజీ IAS)

My answer to JP:

దానికంటే ముందు, ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రి, మంత్రులు, MLA, MPలు, IAS, IPS సహా డాక్టర్లు, ఇంజినీర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగులుగా పనిచేసే వారు, అందరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ & కాలేజీల్లోనే చదివించాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చూపించుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉపయోగించుకుంటే అందులో అయ్యే ఖర్చు ప్రభుత్వధనం కాకుండా వారి వ్యక్తిగత ఆస్తినుండి కర్చుచేయాలి. ప్రభుత్వం లో ఉన్న వారు సొంత వ్యాపారాలు చేయకూడదు. వారి బందువులను బినామీలుగా పెట్టి వ్యాపారాలు చేస్తే వాళ్ళు అన్నిరకాల ఎన్నికల్లోనూ పోటీకి అనర్హులు అని చట్టం చేయాలి.

అలాగే పంచాయితీ, మున్సిపల్, జెడ్పీటీసీ, కార్పోరేషన్, అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి ఎన్నికలలో పోటీ చేయాలనుకునే వాళ్ళు వారి పిల్లలు కూడా కచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ & కాలేజీల్లోనే చదివాలి. అది కనీస అర్హతగా చేయాలి. అలానే ప్రభుత్వ కాంట్రాక్ట్స్, లోన్స్ కూడా, ప్రభుత్వ స్కూల్స్ & కాలేజీలలో చదివిన వాళ్ళకే ఇవ్వాలి.

ఏమంటారు జేపీ గారూ? సమాదానం చెప్పగలరా?