ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త

భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త
ఇకపై రేషన్ షాపుల్లో
ఉల్లి కేజీ రూ.14 మాత్రమే
ఎన్ని కేజీలైనా కొనుగోలు చేయొచ్చు

ఆంధ్రప్రదేశ్ రేషన్ షాపుల్లో కేజీ ఉల్లి రూ.14

📍ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు.. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు.. అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మొదటగా కర్నూలు నగరంలో ఉన్న 170 రేషన్ షాపుల్లో ఉల్లిపాయలు అమ్మడం మొదలుపెడతారు. ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులు, వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కర్నూలు మార్కెట్‌లో మద్దతు ధరకు కొన్న ఉల్లిపాయలను రైతు బజార్లకు పంపుతున్నారు. రేషన్ షాపులు, హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, అన్న క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మార్క్‌ఫెడ్‌ అధికారులు ఉల్లి కొంటుండటంతో వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు. దీనివల్ల ఉల్లి ధర తగ్గడం లేదు. అందుకే ప్రభుత్వం ఉల్లి రైతులకి, కొనేవాళ్ళకి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటోంది.