ప్రత్యేక అధికారుల నియామకం.. టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లకు ఆటంకం…

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రత్యేక అధికారుల నియామకం.. టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లకు ఆటంకం…

@ శ్రీవాణి టిక్కెట్ల నిధులు నేరుగా టీటీడీకే చెందేలా చర్యలు తీసుకోండి..

@ టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కాలనీలో పూర్తిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టండి..

@ టిటిడి బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడును. కలిసిన ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ

మన తెలంగాణ, సెప్టెంబర్ 5, తిరుమల ప్రతినిధి

తిరుమల తిరుపతి దేవస్థానం లో శాశ్వత ఉద్యోగాల నియామకం చేపట్టకుండా చాలా ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా పరిపాలనలో జవాబు దారి తనం లేకుండా పోతుందని టీటీడీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఏదైనా అవినీతి అక్రమాలు తప్పులు జరిగినప్పుడు శాశ్వత ఉద్యోగుల పైన అయితే శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు. అలాకాకుండా విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వ అధికారులను కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకుంటే నిర్వహణ లోపం కారణమే కాకుండా టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లకు ఆటంకం ఏర్పడుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా ఈ విధమైన పరిస్థితి ఉద్యోగులకు ప్రమోషన్లు లేకుండా అర్హులైన వారంతా ఇబ్బందులు పడుతున్నారని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకువచ్చారు.

శుక్రవారం తిరుమలలో చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బి ఆర్ నాయుడు ను టిటిడి ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జి. వెంకటేశం, జి. వెంకటరమణారెడ్డి, జె. భాస్కర్(జెబి), ఎం. ప్రసాదరావు, ఎ. వాసు, కె. ఇందిర, మహేష్, కృష్ణమూర్తి, నీమియనాయక్, సురెష్ తదితరులు కలిశారు. టిటిడి ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

టిటిడి ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ఆలయాల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి ఉద్యోగస్తులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చైర్మన్ బి.ఆర్ నాయుడు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి ల కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆలయాలలో పర్యవేక్షణ కోసం టిటిడి ఉద్యోగులు ముందుకు రావడంలేదని, ఈ కారణంగానే విశ్రాంత అధికారులతో ప్రత్యేక అధికారుల నియామకాన్ని చేపట్టాలని టిటిడి చర్యలు తీసుకుందన్నారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగాల నియామకం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

విశేష ఆదరణ పొందిన శ్రీవాణి దర్శన టికెట్ల విక్రయంలో కొన్ని లోటుపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు వివరించారు. ప్రస్తుతం ₹10,500 పెట్టి యాత్రికులు శ్రీవాణి టిక్కెట్లు కొంటున్నారని, అయితే వారిచ్చే డబ్బులో 500 మాత్రమే టిటిడి కి చెందుతుందని, మిగిలిన 10 వేల రూపాయలు ట్రస్ట్ రూపంలో ప్రభుత్వానికి అందుతోందని, ఆ నిధులను కూడా టీటీడీ ఖాతాలోకే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వివరిస్తూ దళితవాడల్లో ఎక్కువగా మతమార్పిడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు అనేక ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడం జరుగుతుందని, అందుకోసం ఖర్చు పెట్టేందుకే శ్రీవాణి ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టిక్కెట్ల నిధులు ట్రస్ట్ పేరిట ఆలయాల నిర్మాణం కోసం ఖర్చు చేయడం జరుగుతోందని అన్నారు.
ఉద్యోగులు కోరిక మేరకు పిఏసి అలవెన్స్ పై మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం చిన్న సైజు రాష్ట్ర ప్రభుత్వ తరహాలో పరిపాలన సాగిస్తున్నప్పటికీ 30 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో నడపడం టిటిడి ఉద్యోగులు గుర్తించాలని, దీని నుంచి బయటపడేందుకు కొన్ని సంస్కరణలు తీసుకోవడం జరుగుతుందని బిఆర్ నాయుడు వివరించారు.
చర్చల అనంతరం ఉద్యోగులు…
తిరుమల తిరుపతి దేవస్థానముల ఉద్యోగుల ప్రధానమైన సమస్యలపై బి.ఆర్. నాయుడుకు సమావేశమై సమస్యలను లిఖితపూర్వకంగా అందజేశారు. అందులో ముఖ్యమైనవి…

పదోన్నతులు ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ విషయాలపై ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సానుకూలం వ్యక్తపరిచారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కాలనీల అభివృద్ధిపై సౌకర్యాలు అభివృద్ధి పనులపై ధర్మకర్తల మండలిలోఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలియజేసారు.

వడమాల పేట (పాదిరేడు)లో టిటిడి ఉద్యోగులకు కెటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి 3 లక్షల రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ, తుడా అనుమతులు తెప్పించి అభివృద్ది పనులు చేయాలని విన్నవించారు.

పల్లంలో ఇచ్చిన 350 ఎకరాలు స్థలం రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులకు అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఉద్యోగులకు కెటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధినం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మిగిలిన ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.

ప్రత్యేక అధికారుల నియామక నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పి.సి.ఏ. (పిలిగ్రిమ్ కాంపన్జేషన్ అలవెన్స్) పెంచాలని విజ్ఞప్తి చేశారు.