ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

భారత్ న్యూస్ గుంటూరు ….ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీని కింద ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందనుంది. దీంతో రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందనుంది. అలాగే, పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలను ఆమోదించింది.