పూషడం రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

భారత్ న్యూస్ మచిలీపట్నం……పూషడం రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్, గ్రామస్తులు
ఘంటసాల :-
గత ఆరు సంవత్సరాలుగా రహదారి అద్వాన్న స్థితికి చేరి కనీసం ద్విచక్ర వాహనాలపై కూడా ప్రయాణించలేక ఇబ్బందులు పడిన ఘంటసాల మండలం పూషడం గ్రామ ప్రజలకు ఎట్టకేలకు ఆ కష్టాల నుంచి విడుదల కలుగనున్నది.

👍పూషడం గ్రామం నుంచి కొత్తమాజేరు 216 జాతీయ రహదారి వరకు రూ.1.40 కోట్లతో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో రహదారి నిర్మాణానికి నెల రోజుల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది.

👍శుక్రవారం రహదారి నిర్మాణ పనులను ప్రారంభించడంతో గ్రామ సర్పంచ్ అంకం మారుతీరావు, ఉప సర్పంచ్ గల్లా సుబ్రహ్మణ్యం, వార్డు మెంబర్ ఆకుల సత్యనారాయణ గ్రామస్తులు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

👍 ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అంకం మారుతీరావు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా గ్రామ రహదారి చాలా దారుణంగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.

👍 ఈ విషయాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ దృష్టికి తీసుకువెళ్లగా, వారు వెంటనే స్పందించి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారని తెలిపారు. ఈరోజు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు.

👍 అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ లు ప్రత్యేకంగా గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.