చిన్న వ్యాపారాలకు మేలు చేసేలా GST సంస్కరణలు: నిర్మలమ్మ

భారత్ న్యూస్ ఢిల్లీ….చిన్న వ్యాపారాలకు మేలు చేసేలా GST సంస్కరణలు: నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జీఎస్టీ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు మేలు చేస్తాయని తెలిపారు.

చెన్నైలో సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 120వ వార్షికోత్సవంలో మాట్లాడిన ఆమె, జీఎస్టీ మండలి సమావేశం సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో జరుగుతుందని, కొత్త మార్పులు ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతంగా, పారదర్శకంగా మార్చుతాయని చెప్పారు.

చిన్న వ్యాపారాలపై నిబంధనల భారం తగ్గుతుందని, వృద్ధికి తోడ్పడతాయని వెల్లడించారు..