మంచితనం ముసుగులో తెలిసిన వారి ఇంటి వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు

భారత్ న్యూస్ రాజమండ్రి …మంచితనం ముసుగులో తెలిసిన వారి ఇంటి వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు

విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపిఎస్

మంచి మాటలు, ఇరుగుపొరుగు పరిచయం పేరుతో స్నేహ సంబంధాలను మెరుగుపరచుకొని, వారి యొక్క విలువైన వస్తువులు ఎక్కడ భద్రపరుస్తారో గమనిస్తూ, వారూ ఇంటి వద్ద లేని సమయంలో అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను ఈరోజు చల్లపల్లి పోలీస్ వారు అదుపులోనికి తీసుకొని వారు చేసిన వివిధ దొంగతనాలలో ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది.

▪️ఈ కేసు పూర్వాపరాలకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్., గారు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గల సమావేశ మందిరంలో అవనిగడ్డ డి.ఎస్.పి టి.విద్య శ్రీ గారితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ముద్దాయిలు:

1 . షేక్ రహంతున్నీసా W/O నజిబుల్లా @ నజీబ్, 27 సంవత్సరములు, ముస్లిం, నారాయణరావు నగర్, చల్లపల్లి గ్రామము (A-1)

2 . షేక్ నజిబుల్లా @ నజీబ్ S/o జానీ, 32 సంవత్సరములు, ముస్లిం, నారాయణరావు నగర్, చల్లపల్లి గ్రామము మరియు మండలము, కృష్ణా జిల్లా.(A-2)

ఫిర్యాదు అందిందిలా

చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణరావు నగర్ నందుగల నర్రా ప్రభావతి W/O వెంకటేశ్వరరావు తన ఇంటికి తాళం వేసి ఎప్పుడు పెట్టే లాగానే ఇంటి బయట గ్రైండర్లో పెట్టి గుడికి వెళ్ళగా, వచ్చేసరికి తను బీరువాలో పెట్టిన 158 గ్రాముల బంగారపు వస్తువులు, ఒక కేజీ వెండి వస్తువులు కనపడకపోయేసరికి 26.08.2025 తేదీన చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని చల్లపల్లి ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు గారు జిల్లా ఎస్పీ గారికి తెలియజేయగా వెంటనే అవనిగడ్డ డి.ఎస్.పి శ్రీవిద్య గారి ఆధ్వర్యంలో చల్లపల్లి ఎస్సై పి.ఎస్.వి సుబ్రహ్మణ్యం మరియు మోపిదేవి ఔట్ పోస్ట్ ఎస్సై వై.వి.వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

దర్యాప్తు సాగిందిలా

దర్యాప్తులో భాగంగా 29 2025వ తేదీన చల్లపల్లి ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు సిబ్బందితో చల్లపల్లి గ్రామం చివర అనగా పెదకళ్ళేపల్లి క్రాస్ రోడ్ NH 216 హైవే పైన గల రోడ్డు మార్చిన వద్ద పక్క ఇంటిలో అధిక ఉంటున్న భార్యాభర్తల మీద అనుమానంతో వారి ఇరువురిని అదుపులోనికి తీసుకొని వారిది తమదైన శైలిలో విచారించడం మొదలుపెట్టారు. వారు నేను అంగీకరించడంతో నారాయణరావు నగర్ Cr.No.258/2025 U/s 305(a) BNS కేసులో దొంగలించబడిన సత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకొని ఇంకా ఏమైనా నేరాలలో వారి ప్రమేయం ముందే మొన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.

నేరానికి పాల్పడే విధానం

షేక్ రహంతున్నిష, నజీబుల్లా అను భార్యాభర్తలు ఇరువురు అద్దెకు వెళుతూ వారి పక్క ఇంటిలో ఉన్న వారితో మచ్చిక చేసుకుని పరిచయం పెంచుకొని వారితో నమ్మకంగా ఉంటూ వారు బయటకు వెళ్లే సమయంలో ఇంటి యొక్క తాళాలను ఎక్కడ భద్రపరుస్తారు వారి ఇంటిలోని విలువైన వస్తువులు ఎక్కడ ఉంచుతారు వాటి యొక్క వివరాలన్నిటిని సేకరించుకొని అదును చూసి దొంగతనాలు చేయడంలో నిష్ణాతులుగా ఉన్నారు.

అదే క్రమంలో నారాయణరావు నగర్ లో జరిగిన దొంగతనంలో భార్య గ్రైండర్ లో పెట్టిన తాళాలను తీసి ఎవరికి అనుమానం రాకుండా కబోర్డ్ లోని బీరువాతాళాలను తీసి బీరువాలో ఉన్న బంగారపు వెండి వస్తువులను దొంగిలించి ఎక్కడి తాళాలు అక్కడ పెట్టి అనుమానం రాకుండా రాగా భర్త బయట ఉండి ఎవరి కదలికలు గమనిస్తూ ఎవరూ రాకుండా జాగ్రత్త పడడం చేశాడు

▪️అంతే కాకుండా పెనమలూరు లో వీరి బందువుల పెళ్ళికి వెళ్ళి అక్కడ కూడా బంగారము వస్తువులు దొంగతనము చేసినారు. ఈ విధంగా ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు వారు 2024 సంవత్సరము మార్చి నెలలో పెడనలో ఒక దొంగతనము, 2025 సంవత్సరము మే నెలలో పెనమలూరు లో ఒక దొంగతనము చివరిగా ది. 26.08.2025 న చల్లపల్లి నారాయణరావు నగర్ లో ఒక దొంగతనము మొత్తం మూడు దొంగతనలు చేసినట్లు అంగీకరించినారు.

▪️అంతట వారి వద్ద నుండి మూడు దొంగతనాలలో మొత్తం షుమారు 600 గ్రాముల బంగారం, సుమారు 92.800 గ్రాముల వెండి వస్తువులు స్వాదీన పర్చుకోవటం జరిగినధి.

పోలీస్ స్టేషన్ల వారీగా స్వాధీనం చేసుకున్న బంగారపు వెండి వస్తువుల వివరాలు:

1 . చల్లపల్లి పోలీసు స్టేషన్ Cr.No.258/2025 U/s 305(a) BNS కేసులో దొంగిలించబడిన వస్తువులు.

బంగారపు వస్తువులు:-

బంగారపు కళ.

బంగారపు చైన్ 16.250 గ్రాములు,

బంగారపు నక్లెస్ 15.760 గ్రాములు,

లాకెట్ నల్లపూసల గొలుసు.27.120 గ్రాములు,

సాయిబాబా ఉంగరం 7.330 గ్రాములు,5. బంగారపు బ్రాస్లైట్ 8.290,