రూ.5.3 కోట్ల మోసం కేసులో ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..రూ.5.3 కోట్ల మోసం కేసులో ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు

ఐఆర్‌డీఏఐలో భారీ మోసానికి పాల్పడిన అధికారి సత్యనారాయణ శాస్త్రి

నకిలీ ఇన్వాయిస్‌లు, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా రూ.5.3 కోట్ల స్వాహా

ఐఆర్‌డీఏ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు

దేశంలోని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐలో భారీ మోసం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ ఒకరు నకిలీ ఇన్వాయిస్‌లు, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా రూ.5.3 కోట్లను స్వాహా చేశారు. ఈ విషయం వెలుగులోకి రాగానే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

షేక్‌పేటకు చెందిన నిందితుడు భాస్కరభట్ల సత్యనారాయణశాస్త్రి ఐఆర్‌డీఏఐ సాధారణ పరిపాలన విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండేవారు. ఈయన గత కొంత కాలంగా తనకు పరిచయస్తుల వద్ద భారీగా అప్పులు తీసుకున్నాడు. వాటిని తీర్చలేక, తనకున్న అధికారాలతో సంస్థ నిధులు కాజేసేందుకు పథకం వేశాడు.

నకిలీ ఇన్వాయిస్‌లు, ఫోర్జరీ సంతకాలతో మోసం

ఐఆర్‌డీఏఐలో వివిధ పనుల కోసం కొనుగోలుదారుల నుంచి ఇన్వాయిస్‌లు తీసుకునే ప్రక్రియ