జస్టిస్ సుదర్శన్ రెడ్డితో భేటీ అయిన సీఎం రేవంత్..

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:-
జస్టిస్ సుదర్శన్ రెడ్డితో భేటీ అయిన సీఎం రేవంత్..

ఇండియా కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి సోమవారం తాజ్ కృష్ణాలో అభినందన కార్య‌క్ర‌మం నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని, నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు, నందమూరి తారక రామారావు,జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.