మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో ఆటోమేటిక్‌ క్లౌడ్‌ సేవ్‌.. , ఈ ఆప్షన్‌ ఆపేదెలా?

భారత్ న్యూస్ విశాఖపట్నం..మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో ఆటోమేటిక్‌ క్లౌడ్‌ సేవ్‌.. , ఈ ఆప్షన్‌ ఆపేదెలా?

Microsoft Word | ఇంటర్నెట్‌ డెస్క్:  మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. , తాజాగా వచ్చిన అప్‌డేట్‌లో ఇకపై మీ వర్డ్‌ డాక్యుమెంట్లు డిఫాల్ట్‌గా వన్‌డ్రైవ్ లేదా మీరు ఎంచుకున్న ఇతర క్లౌడ్ స్టోరేజ్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. , ఈ ఆటోమేటిక్‌ క్లౌడ్ బ్యాకప్‌ ఫీచర్‌ వల్ల రిమోట్‌ యాక్సెస్‌, ఫైళ్లపై ఫ్లెక్సిబుల్ కంట్రోల్‌, మరింత భద్రత వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. 

అలాగే మైక్రోసాఫ్ట్‌ 365, కోపైలట్‌ చాట్, కోపైలట్‌ లైసెన్స్‌ ఉన్న యూజర్లు అదనంగా కోపైలట్‌ ఫీచర్లను కూడా వాడుకోవచ్చు. , అయితే ఈ ఫీచర్‌ అందరికీ సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. , కొందరికి తమ ఫైల్స్‌ క్లౌడ్‌లో నిల్వ చేయడం ఇష్టం ఉండదు. , అలా అనుకొనే వారిలో మీరూ ఒకరైతే.. , ఆటోమేటిక్‌ క్లౌడ్‌ బ్యాకప్‌ను ఆప్షన్‌ తొలగించుకొనేందుకు ఈ కింద పేర్కొన్న స్టెప్స్‌ ఫాలో అవ్వండి. 

మీ విండోస్‌ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఓపెన్‌ చేసి ఎడమవైపు పైభాగంలో ఉన్న ఫైల్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

మెనూలో ‘ఆప్షన్స్’ను ఎంచుకుని సేవ్ ట్యాబ్‌కి వెళ్లండి.

అక్కడ “Create new files in the cloud automatically” ఆప్షన్‌లో ఉన్న టిక్‌ మార్కును తీసేయండి. 

ఆ తర్వాత “Save to Computer by Default” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మొదటి ఆప్షన్‌ డిసేబుల్‌ చేస్తే వర్డ్‌ మీ డాక్యుమెంట్లను క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా సేవ్‌ చేయదు. , రెండో ఆప్షన్‌ యాక్టివ్‌ చేస్తే మీ సిస్టమ్‌లోని లోకల్‌ స్టోరేజ్‌లో ఫైల్స్‌ సేవ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది~£