జర్నలిస్టు మిత్రునికి సహచర జర్నలిస్టుల సత్కారం

భారత్ న్యూస్ గుంటూరు ….జర్నలిస్టు మిత్రునికి సహచర జర్నలిస్టుల సత్కారం

ప్రముఖ జర్నలిస్టు, రచయిత పున్నా కృష్ణమూర్తి ని గుంటూరులో రెండున్నర దశాబ్దాల క్రితం వివిధ దినపత్రికలలో స్టాఫ్‌ రిపోర్టుర్లుగా, రిపోర్టర్లుగా పనిచేసిన ఆయన సహచరులు ఘనంగా సత్కరించారు. ఆదివారం రాత్రి గుంటూరులోని భారతీయ విద్యాభవన్‌లో పున్నా కృష్ణమూర్తి రచించిన ‘‘ ధరిణికోట `నాగార్జునకొండ శిల్పసంపద సచిత్ర వ్యాససంకలనం ’’ పుస్కకావిష్కరణ సభ మాజీమంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అధ్యక్షతన జరింగింది. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతిరావు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, యస్. రవికుమార్‌, యస్‌.యం. సందాని, బి.యల్‌. నారాయణ, అవ్వారు శ్రీనివాసరావులు పున్నా కృష్ణమూర్తిని దుశ్శాలువతో సత్కరించి రెండున్నర దశాబ్దాల క్రితం నాటి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.