భారత్ న్యూస్ విశాఖపట్నం..జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్
జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది. 250 కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ(బ్రీచ్) అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది జూన్ ప్రథమార్థంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది. ముందుగా అనుకున్నదానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది. ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారని, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని, లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది….
