భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది ఏమీ ఉండదని నిరూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది ఏమీ ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారని పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కొనియాడారు.
కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలవల విస్తరణ పనుల నేపథ్యంలో కృష్ణమ్మకు జల హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విక్కుర్తి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి, పూలదండతో సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాస్ లు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
మంచినీటి, సాగునీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. హంద్రీనీవా కాలవల విస్తరణ పనుల ద్వారా కుప్పం నియోజకవర్గంలో చివరి భూముల వరకు కృష్ణా జలాలు చేరతాయని ఈ సందర్భంగా శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అవనిగడ్డ నియోజకవర్గ కూటమి నేత కొద్దిసేపు ముచ్చటించడం అవనిగడ్డ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
