HQ-9 వర్సెస్ S-400 ఏది గొప్పది..?

దాడులు చేయడమే కాదు.. దాడులను నుంచి రక్షించుకోవడం కూడ ముఖ్యమే.. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ .. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ల పనితనంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తాజాగా పాకిస్థాన్ కు చైనా ఇచ్చిన HQ-9ను భారత్ ధ్వంసం చేసింది.. ఇటు పాక్ ప్రయోగిస్తున్న మిస్సైళ్లను ఎస్‌-400 రక్షణ వ్యవస్థతో భారత్ కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది శక్తివంతమైంది ..? ఒక వేళ క్షిపణులు వచ్చిన ఏది సమర్థవంతంగా అడ్డుకోగలదు..?

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు ప్రతిదాడులు పెరిగిపోయాయి. అయితే ఆయుధాలు ప్రయోగిండమే కాదు.. వాటి నుంచి రక్షణ పొందం కూడా ముఖ్యమే. దీంతో రెండు దేశాల డిఫెన్స్ సిస్టమ్ ల పై చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ లోని సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు చేస్తోంది… దీనికి ఇండియన్ ఆర్మీ దీటుగా సమాధానం చెబుతోంది. అంతే కాదు.. ఏకంగా పాకిస్థాన్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నాశనం చేసింది. డ్రోన్ దాడులతో పాక్ ను వణికిస్తోంది.

ఈ దాడులలో రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్షిపణులు, హామర్ బాంబులను భారత వాయుసేన ఉపయోగించింది. పాకిస్తాన్‌లోని లాహోర్ వద్ద ఉన్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేశామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అటు పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది. అయితే భారత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. S-400 వ్యవస్థను భారతదేశం మొదటిసారి ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో S-400, HQ-9 రెండింటిలో ఏది గొప్పదనే చర్చ జోరందుకుంది.

ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్థాన్‌ వైమానిక, క్షిపణి దాడులకు దిగితే నిలువరించే అత్యంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్‌-400. శత్రువుల యుద్ధవిమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గమధ్యంలోనే పేల్చివేయడంలో దీనికి తిరుగులేదు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. ఇది మొబైల్ క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన ఎన్‌పీవో అల్మాజ్‌ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న ఎస్‌-300ను ఆధునికీకరించి, దీన్ని రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన ఎస్‌-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యర్థి జామింగ్‌ విధానాలను ఎస్‌-400 తట్టుకోగలదు.

ఇది యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చగలదు. మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్‌.. 2018లో రష్యాతో 543 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్‌ చేరాయి. మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది. పాకిస్థాన్‌ నుంచి ఎదురయ్యే ముప్పుల కోసం పంజాబ్‌లో, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఎస్‌-400 వ్యవస్థలను మోహరించినట్లు తెలుస్తోంది. చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా.

ఇక HQ-9 అనేది చైనా అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్రూజ్ మిసైళ్లు వంటి గగనతల శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇది ప్రధానంగా రూపొందించబడింది. HQ-9 వ్యవస్థ S-300 ఆధారంగా తయారు చేశారు. అయితే ఇందులో చైనా కొన్ని స్వదేశీ టెక్నాలజీనీ జోడించి మెరుగులు దిద్దింది. HQ-9 సిస్టమ్ పరిధి సుమారు 200 కిలోమీటర్లు కాగా, ఇది సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించగలదు. HQ-9A, HQ-9B, HQ-9C వంటి మోడల్స్ ను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థను పాకిస్తాన్, అల్జీరియా వంటి కొన్ని దేశాలకు చైనా ఎగుమతి చేసింది. దీనిని చూసుకునే చైనా ఇప్పటి వరకు విర్రవీగింది. అయితే భారత్ దానికి కూడా ధ్వంసం చేసింది.

సాంకేతిక పరంగా చూస్తే, HQ-9 ఒక స్వదేశీ పరంగా అభివృద్ధి చేసింది అయినా, ఇది S-300 & S-400 వ్యవస్థలను కాపీ కొట్టినట్టు ఉంటుంది. కానీ S-400 అనేది స్వతంత్రంగా అభివృద్ధి చేయబడిన అత్యాధునిక వ్యవస్థ. దీనిలో వాడే మిసైళ్లు మరింత శక్తివంతమైనవి, ఫాస్ట్ రెస్పాన్స్, మల్టీ-టార్గెట్ ఎంగేజ్‌మెంట్ వంటి అధిక ప్రయోజనాలు కలిగివుంటాయి. HQ-9 కన్నా S-400 ను ప్రపంచ దేశాలు అధికంగా నమ్ముతున్నాయి. ముఖ్యంగా స్ట్రాటజిక్ డిఫెన్స్ అవసరాల కోసం ఇది ఎంతో ముఖ్యం. ప్రస్తుతం S-400ను ఉపయోగించే పాకిస్థాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను భారత్ కూల్చివేస్తోంది. పోల్చి చూస్తే చైనాకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ HQ-9కంటే, S-400 మెరుగైనదిగా భావిస్తారు.

మరోవైపు S-400 ఉన్నప్పటికీ స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్‌.. ప్రాజెక్టు కుశను చేపట్టింది. ఇది దీర్ఘశ్రేణి వ్యవస్థ. ఇది.. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి అస్త్రాలను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. డీఆర్‌డీవో దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణులు ఉంటాయి. సమర్థత విషయంలో ఇది ఎస్‌-400కు, ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థకు ఏ మాత్రం తీసిపోదు. ఇది స్టెల్త్‌ యుద్ధవిమానాలు, క్రూజ్‌ క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చగలదు.