భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..దొంగలు వస్తున్నారు జాగ్రత్త
మాటల్లో మభ్యపెట్టి బంగారు ఆభరణాలు మాయం
మహబూబ్ నగర్ నుండి షాద్ నగర్ వైపు రాక
ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండండి
షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్
దొంగతనానికి సంబంధించిన తాజా వీడియో విడుదల
దొంగలు వస్తున్నారు.. నిజమే మీరు వింటున్నది. అమాయకుల వద్ద చాకచక్యంగా బంగారు నగలు కాజేసి వాటిని క్షణాల్లో దొంగిలిస్తున్న ఒక గ్యాంగ్ మహబూబ్ నగర్ వైపు నుండి షాద్ నగర్ వైపు వస్తోంది. పాలమూరు పట్టణంలో ఇప్పటికే ఆరు తులాల వరకు బంగారు నగలు కాజేసిన ఘటన వీడియోను షాద్ నగర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ముఖ్యంగా అమాయకుల మెడలో ఉన్న బంగారం చూసి దొంగలు ఉన్నారు మీరు అప్రమత్తం కావాలి అంటూ వారి వద్ద ఉన్న నగలను తీసి ఒక పేపర్లో చుట్టి లోపల పెట్టుకోండి అంటూనే వాటిని చాకచక్యంగా తస్కరిస్తారని షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా వీడియోకు విడుదల చేశారు. మహబూబ్ నగర్ వద్ద రెండు ఘటనలు చోటుచేసుకున్నాయని ఒకరి వద్ద 4 తులాలు మరో వ్యక్తుల వద్ద 2 తులాలు ఆభరణాలు కాజేశారని వారు కొంత తమిళ యాసలో తెలుగు మాట్లాడతారని ప్రజలకు వీరు ఎక్కడైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా వారి నుండి అప్రమత్తంగా ఉండాలని సిఐ విజయ్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు సూచించారు..
