చెప్పింది కోటి రూపాయలు.. ఇచ్చింది 25 లక్షలు.. 75 లక్షలు స్వాహా!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..చెప్పింది కోటి రూపాయలు.. ఇచ్చింది 25 లక్షలు.. 75 లక్షలు స్వాహా!

సిగాచి అగ్నిప్రమాదంలో చనిపోయిన బాధితులకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఇచ్చింది మాత్రం రూ.25 లక్షలు మాత్రమే

రూ.కోటి ఇస్తామని చెప్పి.. రూ.25 లక్షలు ఇచ్చినట్లు హైకోర్టులో తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కంపెనీ అగ్నిప్రమాదం బాధితులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని హైకోర్టులో పిల్ వేసిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు

ఈ పిల్ విచారణలో భాగంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది

కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది సమయం కోరడంతో, సెప్టెంబర్ 17వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.