భారత్ న్యూస్ ఢిల్లీ…..కుప్పకూలిన F-16 ఫైటర్ జెట్..
పైలట్ మృతి
పోలాండ్లో F-16 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఎయిర్ షో రిహార్సల్లో ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్ మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. జెట్ కూలిన వీడియో వైరల్ అవుతోంది. కాగా 2017లో అమెరికా చేసిన F-16 జెట్ కొనుగోలు ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది..,
