A.P:జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…A.P:జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

📍జిందాల్ సంస్థకు చెందిన సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడు, ఓబుళాపురం వద్ద 1,327 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజ అన్వేషణకు కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం. అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలంలోని ఓబుళాపురం, హిర్దేహాళ్ గ్రామాలు, బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామ పరిధిలోని మించేరి రక్షిత అటవీ ప్రాంతంలో ఖనిజాన్వేషణకు ఈ లైసెన్స్ మంజూరు చేశారు. ఈ కాంపోజిట్ లైసెన్స్ మంజూరుకు 2023 మార్చిలో టెండర్లు పిలిచారు. అక్కడ తవ్వితీసే ఖనిజం విక్రయించే సమయంలో ఉన్న ధరలో 10 శాతం ప్రభుత్వానికి చెల్లించేలా రిజర్వ్ ధర ఖరారు. ఈ-వేలంలో సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ సంస్థ 12.60 శాతం చెల్లిస్తామని కోట్ చేసి, బిడ్ దక్కించుకుంది. దీనికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 27న ఎల్వోఐ జారీ చేసింది. ఆ సంస్థ ఐదేళ్లలో బోర్లు వేసి, ఖనిజాన్వేషణ చేయాలి. ఎంత ఇనుప ఖనిజం ఉందో గుర్తించాక.. ఖనిజం లభించే ప్రాంతానికి లీజు మంజూరు చేయాలని కోరుతుంది.