MLA Veerendrapaapi: బెట్టింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు 28వరకు కస్టడీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..MLA Veerendrapaapi: బెట్టింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు 28వరకు కస్టడీ

📍బెట్టింగ్‌ కేసులో కాంగ్రెస్‌ చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్రపప్పి (50)ని ఈనెల 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ప్రజాప్రతినిధుల కోర్టు అప్పగించింది. ఎమ్మెల్యేను సిక్కింలో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆదివారం బెంగళూరుకు తీసుకొచ్చారు. కెంపేగౌడ విమానాశ్రయం టర్మినల్‌2లోకి రాగానే స్థానిక అధికారులు బందోబస్తు మధ్య తరలిచి, ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించి, విచారణ ప్రారంభించారు.