భారత్ న్యూస్ అనంతపురం….ఉద్దేశపూర్వకంగా భూమి విలువ ప్రస్తావించలేదు- భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్
టీటీడీ భూమిని టూరిజం ల్యాండ్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవడమే లక్ష్యంగా మే 7న సింగిల్ ఎజెండాతో టీటీడీ మీటింగ్ నిర్వహించి, దానిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత 07.08.2025న టీటీడీ స్థలాన్ని టూరిజంకి, టూరిజం డిపార్ట్మెంట్ స్థలాన్ని టీడీకి ఇచ్చినట్టుగా జీవో ఇచ్చారు. రూ. 1500 కోట్ల విలువైన 20 ఎకరాల టీటీడీ స్థలాన్ని టూరిజంకి అప్పగించి, టూరిజం నుంచి వేరే స్థలాన్ని తీసుకుంటున్నారు. అయితే గతంలో ఒకసారి ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని ఖండిస్తున్నామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు టూరిజం డిపార్ట్ మెంట్‌తో ఎక్స్చేంజ్ చేసుకున్న స్థలాన్ని ఒబేరాయ్ హోటల్‌కి ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నాడు. ఇంకా చెప్పాలంటే గతంలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణం చేయాలనుకున్న స్థలం కన్నా ఇంకా శ్రీవారి పాదాలకు దగ్గరగానే ఈ హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని చంద్రబాబు ఇప్పిస్తున్నాడు. తిరుపతి అర్బన్ పరిధిలో ఉండే విలువైన భూమిని, రూరల్ పరిధిలో ఉన్న టూరిజం ల్యాండ్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను అప్పనంగా దోచిపెట్టడమే అవుతుంది. ఆరోజు జరిగిన టీటీడీ సమావేశంలో రెండు రకాల భూముల విలువకు వ్యత్యాసం ఉందని పేర్కొంటూనే, వాటి విలువను ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించకుండా వదిలేశారు. పైగా ఎవరో టీటీడీకి దానమిచ్చినట్టుగా చెబుతూ ఆ భూమిని ఇనా భూమి అని టీటీడీ టేబుల్ అజెండాలో పేర్కొన్నారు. ఈ భూమిని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ప్రభుత్వ లెక్కల ప్రకారమే టీటీడీకి రూ. వెయ్యి కోట్ల నష్టం జరుగుతోంది.
