భారత్ న్యూస్ అనంతపురం.చిత్తూరు జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన
900 కిలోల తమిళనాడు రేషన్ బియ్యం మరియు ఒక ఆటో స్వాధీనం – గుడిపాల పోలీస్.
“ఎవరైనా అక్రమ రవాణా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము,” – గుడిపాల ఎస్‌ఐ శ్రీ రామ్మోహన్.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ గారు, అక్రమ రవాణా మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి తగిన చర్యలు చేపడుతున్నారు.
📍ఈ నేపధ్యంలో, గుడిపాల మండలంలోని అరుళపురం లోని అలెక్స్ అనే వ్యక్తి గోడౌన్‌ను అద్దెకు తీసుకున్న గంగాసాగరంకు చెందిన రాజేష్, తమిళనాడు నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, స్థానికంగా నిల్వ చేసి, పలమనేరు మరియు బంగారుపేట ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నాడన్న సమాచారం అందింది.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి. సాయినాథ్ గారి పర్యవేక్షణలో, తమిళనాడు నుండి రేషన్ బియ్యాన్ని తెచ్చి అరుళపురం లోని గోడౌన్‌లో దాచే ప్రయత్నం చేస్తున్న సమయంలో గుడిపాల ఎస్‌ఐ మరియు సిబ్బంది అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్ మరియు పూర్ణను అరెస్ట్ చేసి, 900 కిలోల తమిళనాడు రేషన్ బియ్యం మరియు రవాణాకు ఉపయోగించిన ఒక ఆటోను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయబడింది.

ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.