భారత్ న్యూస్ రాజమండ్రి ….వాతావరణ అప్‌డేట్ – ఆగస్టు 22, 2025
దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఆగస్టు 25న ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
📍ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పర్వతీపురం)తో పాటు తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
📍ఎలూరు, కృష్ణా మరియు ఎన్‌టిఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

📍తీర ప్రాంతాలు, కొండప్రాంతాల్లో భారీ వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండండి.