ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించటం ఎలా?

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించటం ఎలా?

సుప్రీంకోర్టు/హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం లోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ను కూడా తొలగించ వచ్చు అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) సూచిస్తుంది.

100 మంది లోక్సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు లిఖితపూర్వ ప్రతిపాదన/తీర్మానం స్పీకర్ ముందు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం, రాజ్యసభ మరియు లోక్సభ రెండింటిలో కూడా ప్రత్యేక మెజారిటీ (special majority) తో తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. అంటే 50% కంటే ఎక్కువ సభ్యుల ఆమోదం & 2/3 వంతు ఓటు వేసినవారి మద్దతు ఉండాలి. రెండు సభల ఆమోదం అవసరం.

తరువాత ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా రాష్ట్రపతి ఆ తీర్మానాన్ని అనుసరించి భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగిస్తారు.

Note: ప్రజా అవగాహనార్థం జారీ చేయడమైనది.