భారత్ న్యూస్ విజయవాడ..ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి సంబంధం – బంగారం కొనాలని రూ.45 లక్షలు కాజేసిన కిలేడీ
📍ఎన్టీఆర్ జిల్లాలో ఇన్స్టాగ్రామ్ సంబంధం పేరిట మహిళ నయవంచన – వధువుకు బంగారం కొనాలంటూ రూ.45 లక్షలకు టోకరా
అక్రమ సంపాదన కోసం విద్యాధికురాలైన మహిళ ఓ కుటుంబాన్ని నయవంచనకు గురి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు తెలిపిన వివరాల మేరకు సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అసలేం జరిగిందంటే? ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా పని చేస్తున్న ఈడేపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో అందంగా ఉన్న యువకుడి ఫొటో చూసి అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావించాడు. ఇన్‌స్టాగ్రాంలో ఉన్న నంబరుకు ఫోన్ చేస్తే ఒక మహిళ ఫోన్ ఎత్తి మాట్లాడింది. తాను ఆ యువకుడి తల్లినంటూ తనను తాను పరిచయం చేసుకుని నమ్మించింది. ఆమె కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని వ్యక్తి కోరడం, అందుకు సదరు మహిళ సైతం సానుకూలంగా స్పందించడంతో వాట్సాప్ ద్వారా ఇరువురి కుటుంబాలకు చెందిన పూర్తి వివరాలన్నీ ఒకరికొకరు పంచుకున్నారు.

బంగారం కొనాలని రూ.45 లక్షలు కొట్టేసిన కిలేడీ: ఆ యువకుడితో