భారత్ న్యూస్ గుంటూరు ….మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఊటగుండం నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
2025 ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయిలో 1st ప్లేస్ సాధించిన
ఊటగుండం శివారు చేబోయినదిబ్బ కు చెందిన బట్రాజు కావ్య మరియు వారి తల్లిదండ్రులకు సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి దేవనబోయిన కనకదుర్గ, వైస్ MPP శ్రీమతి చేబోయిన లీలావతి, పంచాయతీ వార్డు మెంబర్లు పాఠశాల ఎస్ఎంసి చైర్మన్, గ్రామ పెద్దలు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెరవలి రాంబాబు,సిబ్బంది రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
గ్రామానికి పేరు తెచ్చిన కావ్యను అందరు అభినందించారు.
