భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎర్రకోటపై 12 సార్లు జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ వరుసగా 12 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని హోదాలో అత్యధిక సార్లు జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు ఎగురవేయగా.. మోదీ 12 సార్లు ఆవిష్కరించారు. గతంలో ప్రధానులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ 10 సార్లు, అటల్ బిహారీ వాజ్పేయీ 6 సార్లు, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు 5 సార్లు, మొరార్జీ దేశాయ్, లాల్ బహుదూర్ శాస్త్రీ 2 సార్లు జాతీయ జెండాను ఎర్రకోటపై ఎగురవేశారు….
