
‘ఒత్తిడి’ ఆ మాటే ఒత్తి పలకాల్సి వస్తోంది. మీ బుర్ర పాడయ్యే అతి ఆలోచనల వల్ల మీకు ఒత్తిడి కలుగుతుందని మీకు తెలుసా… దీంతో మనసు పాడవుతుంది. ప్రశాంతత కరువవుతుంది.
ఒత్తిడిని జయించాలంటే… కొన్ని మార్గాలున్నాయి. ముందుగా మనం ఏదైనా విషయాన్ని ముఖ్యమైంది అనుకుంటేనే మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టిన దానిని వెంటనే పూర్తి చేయాలి. ఒకవేళ వెంటనే చేయాల్సిన పని లేకున్నా.. కొంత సమయం పట్టినా.. దాన్ని మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే… అయితే అది ఎప్పుడు, ఎలా చేయాలో తెలియాలి అంతే..
స్ట్రెస్ – కారణాలు:
- సొసైటీ ఫియర్…
చాలామంది స్ట్రెస్ కి కారణాలు రకరకాలుగా చెబుతుంటారు. ఇది చేస్తే వాళ్లు ఏమనుకుంటారో, ఒకవేళ చేయకపోతే వీళ్లు ఏమనుకుంటారో అని, ఇలా.. సొసైటీ ట్రాప్ లో పడి, ఏది సరిగా చేయలేరు. ఇది నేరుగా కాకున్నా, ఇంటర్నల్ గా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఏంటో ఇతరులకి తెలిసేలాగా బతకాలి. నువ్వు ఏంటో తెలిసినప్పుడు నీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది.
- హార్డ్ వర్క్…
నువ్వు చేస్తున్న పని నీకు నచ్చనట్లైతే చాలా ఎఫెక్టివ్, తొందరగా ఒత్తిడికి లోనవుతావు. ఒక నిరుద్యోగి రోజుల తరబడి ఉద్యోగావకాశాల కోసం వెతుకుతుంటాడు. కానీ తన ఇంట్లో వస్తువుల్ని ఎక్కడపడితే అక్కడ వేస్తాడు. తనకి ఉద్యోగం రాలేదనే నిరాసక్తితో, ఇంట్లో దేన్ని సరిగ్గా ఉంచుకోడు. ఇది చిన్న విషయం కావొచ్చు. కానీ ఇండైరెక్ట్ గా దేనిమీద ఆసక్తి పెట్టలేక స్ట్రెస్ ఫీలవుతాడు.
- ఇన్ పిరియార్టీ కాంప్లెక్స్…
నాలో ఏదో లోపం ఉందనే భావన దేనికి దారి తీస్తుందంటే, నేను దేనికి పనికి రాను. నా దగ్గర డబ్బు లేదు. నేను అందంగా లేను. నేను పదిమందిలో సరిగ్గా మాట్లాడలేను. ఇలాంటి స్వీయ నిర్ణయాలకు వచ్చేస్తాం. ఫైనల్ గా నువ్వు ఆ పనిని ఎప్పటికి చేయలేవనే ఆత్మనూన్యత భావం నిన్ను రోజురోజుకి వెంటాడుతూ, అధఃపాతాళానికి నిన్ను తోసేస్తుంది. ఫలితంగా స్ట్రెస్ కి కారణమవుతుంది.
- సూపర్ ఇగో…
ప్రతి మనిషికి కొన్ని కోరికలుంటాయి. కానీ వాటికి నిలకడ ఉండదు. ఆ కోరికను నెరవేర్చుకునే క్రమంలో లోపల ఉన్న ఈగో అడ్డొస్తుంటుంది. ఈగో ఇష్టపడకపోతే ఆ పనిని సాఫీగా చేయలేం. మనసు ఈగోని ఎప్పుడైతే గెలవలేదో అప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవాల్సి వస్తుంది.
కాబట్టి వీటిపై అవగాహన పెంచుకొని తిరిగితే స్ట్రెస్ కి దూరమవచ్చు.