
ఈరోజుల్లో ఎదగాలంటే సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం. అది ఉద్యోగంలో అయినా.. వ్యక్తిగతంగా అయినా.. ఏ విభాగంలోనైనా రాణించాలంటే ఇవి మెరుగ్గా ఉండాలి. మీ సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈసారి ఇవి పాటించండి.
కమ్యూనికేషన్: సాఫ్ట్ స్కిల్స్లో అత్యంత ముఖ్యమైనది కమ్యూనికేషన్. ఇతరులతో మాట్లాడేముందు ఎదుటివారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా దానికి అనుగుణంగా వారితో మాట్లాడటం అలవడుతుంది.
ఐ కాంటాక్ట్: మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారితో ఐ-కాంటాక్ట్ మెయింటెన్ చేయాలి. అప్పుడు మీరు చెప్పాలనుకున్నది లేదా మాట్లాడాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పగలుగుతారు.
మాట్లాడటం ప్రాక్టీస్: నలుగురిలో లేదంటే స్టేజీ మీద మాట్లాడటం మీకు కష్టంగా అనిపించినప్పుడు.. మాట్లాడటం బాగా ప్రాక్టీస్ చేయాలి. అందుకు ముందుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో తరచుగా మాట్లాడటం వల్ల మరింత కాన్ఫిడెంట్ గా మాట్లడగలుగుతారు.
యాక్టివ్ లిజనింగ్ ప్రాక్టీస్: యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్. ఏకాగ్రత, సహనం, స్వీయ-క్రమశిక్షణ అవసరం. ఇతరులు ఏమి చెప్తున్నారో అర్థం చేసుకోవడం.. అందుకు తగ్గట్టు బదులివ్వడం.. అలవాటు చేసుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్ లేదంటే విషయంపై ఆసక్తి ఉందని ఇతరులు భావిస్తారు. అలాగే అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు.. అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి.