క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ కట్టడం లాభమా.. నష్టమా..?!

గత కొన్ని సంవత్సరాలుగా మన భారత్ లో క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. 2024 నాటికి భారతదేశంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్ల సుమారు సంఖ్య 10 కోట్లకు చేరింది. ఇప్పుడు జనాలు ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్ ఏవీ కొనాలన్నా.. ఎక్కువగా క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మనకు కావల్సింది ఎప్పటికప్పుడు కొనగలం. బిల్లు నిర్ణీత సమయం గదువుతో చెల్లింపు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని మెయింటెయిన్ చేస్తున్నారు.

అయితే బిల్లు చెల్లింపు విషయంలో ఉన్న ఆప్షన్స్ సరిగా వినియోగించుకుంటున్నారా.. లేదా.. లాంగ్ టర్మ్ లో ఇలానే మినిమం డ్యూ లు కట్టడం వల్ల ఫ్యూచర్ సిబిల్ ఎఫెక్ట్ అవుతుందా.. లేదనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

  • ముందుగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, మీకు మొదట మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఒకటి పూర్తిగా బిల్లు పే చేయడం,
  • రెండవది మినిమమ్‌ అమౌంట్‌ లేదా మినిమమ్‌ డ్యూ కట్టడం,
  • మూడవది అదర్ అమైంట్.
  • ఏ నెల బిల్లు ఆ నెల కడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, కొంతమంది మినిమమ్‌ అమౌంట్ చెల్లించి తాత్కాలికంగా రిలీఫ్ అవుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..

సాధారణంగా, మినిమమ్‌ అమౌంట్ చెల్లించడం వల్ల మీ CIBIL ఎఫెక్ట్ అవ్వదు. కానీ మీరు ఇలా పదే పదే చేస్తే మీ క్రెడిట్ స్కోర్ రిఫ్లెక్ట్ అవ్వొచ్చు. నిజానికి, కనీస మొత్తాన్ని చెల్లించడం ద్వారా, మీ మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతుంది. మీరు ఇలా పదే పదే చేస్తే, మీరు అప్పుల ఊబిలో చిక్కుకుంటారని మరవద్దు. అటువంటి పరిస్థితిలో, రుణ మొత్తం తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. ఇది CIBIL స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. ఒకరకంగా కనీస మొత్తాన్ని చెల్లించడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. పైగా వడ్డీ భారం తప్పదు.

చాలావరకు బ్యాంకులు మొత్తం బిల్లులో 5% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి దీనిలో మార్పులుండొచ్చు. కానీ, కనీస చెల్లింపుల వల్ల కేవలం పెనాల్టీలు, లేటు ఫీజుల నుంచి మాత్రమే మీకు రిలీఫ్ ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తానికి బ్యాంకు వడ్డీ మాత్రం తప్పదని గుర్తుంచుకోవాలి. కాబట్టి, వీలైనంతవరకు చెల్లించాల్సిన మొత్తం ఏ నెలకు ఆ నెల క్లియర్ చేసుకుంటే మంచిది. లేదంటే వడ్డీ భారం పెరుగుతుంది.