వైభవంగా లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…వైభవంగా లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

స్వామివారికి నూతన శేష వాహనం సమకూర్చిన ధర్మకర్త పోతరాజు భాస్కరరావు

శేష వాహనం, గ్రామోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డలోని శ్రీ భూ నీళా రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయ అనువంశిక ధర్మకర్త పోతరాజు భాస్కరరావు దాదాపు రూ.లక్ష వ్యయంతో స్వామివారికి సమకూర్చిన శేష వాహనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు.

నూతన శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా స్వామివారు ప్రధాన వీధుల మీదుగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
ముందుగా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చక స్వాములు దేవస్థానంలో నిత్యహోమం, బలిహరణం, నృసింహ జయంతి నిర్వహించారు.

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, కుమార్తె – అల్లుడు శీలం కృష్ణప్రభ – అశ్విన్ కుమార్ దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ఈఓ యార్లగడ్డ శ్రీనివాసరావు (వాసు), ఆలయ అనువంశిక ధర్మకర్త పోతరాజు భాస్కరరావు నేతృత్వంలో వారికి ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం బహుకరించారు. అనంతరం ధర్మకర్తల స్వగృహములో స్నాతకపు కావడి, నిత్యహోమం, బలిహరణం, జగజ్జ్యోతి ప్రజ్వలనం, ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు. పోతరాజు పవన్ కుమార్ – సుమిత్ర దంపతులచే కళ్యాణ మహోత్సవము కన్నుల పండువగా నిర్వహించారు.
అర్చక స్వాములు దీవి సారంగపాణి, బృందావనం అనంతరామాచార్యులు, దీవి వాసుదేవ సీతారామకృష్ణ, బృందావనం వేణుగోపాలాచార్యులు, రొంపిచర్ల భట్టార్ శత్రుఘ్నాచార్యులు, దీవి విజయ రాఘవ భట్టార్ ఆచార్యులు, దీవి అప్పలాచార్యులు, దీవి రఘునాథాచార్యులు, దీవి పార్థ వేంకట రామ శ్రీనివాసాచార్యులు, పాణింగిపల్లి దుర్గా రామ సత్య పవన్ కుమార్ ఆచార్యులు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలు తిలకించి తరించారు.