ఎక్కువ నీళ్లు పోస్తే మొక్కలకు డేంజర్ …

వేసవిలో మొక్కలు ఎండిపోవద్దని మూడు పూటలా నీళ్లు పోస్తుంటారు కొందరు. ఇంకొందరు మాటిమాటికీ ఎందుకని.. ఒక్కసారే కుండీలను పూర్తిగా నింపేస్తుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి నీళ్లు పట్టడం.. మొక్కలకు హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ తడిగా ఉండే ప్రాంతంలో ఫంగస్‌ ఎక్కువగా పెరుగుతుందని వారు తెలిపారు. అది మొక్కలను నాశనం చేస్తుంది. మొక్కల ఆకులు, పై భాగాల్లోనేకాదు.. మొక్కల మూలాల్ని కూడా దెబ్బతీస్తుంది. కొన్నిరకాల ఫంగస్‌లు.. మొక్కలు చనిపోయేలా చేస్తాయి కూడా! అందుకే మొక్కలు ఎక్కువ తేమలో ఉండకుండా చూసుకోవాలి. కుండీల్లోని మట్టి పొడిగా ఉన్నప్పుడే నీళ్లు పట్టాలి. ఫంగస్‌ పట్టినట్లు గుర్తిస్తే..

దాల్చిన చెక్క పొడిని మొక్కల మొదట్లో చల్లాలి. ఇందులోని యాంటి ఫంగల్‌ లక్షణాలు.. ఫంగస్‌ను సమూలంగా నిర్మూలిస్తాయి. అంతేకాదు.. ఫంగస్‌ మూలంగా దెబ్బతిన్న మొక్కల్ని కోలుకునేలా చేస్తాయి.