…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ప్రతి ఇంటికీ ఈ స్టిక్కర్.. ఉంటేనే లెక్కలోకి వస్తారు..!!

PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్

సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల లెక్కలు తీస్తున్నారు. శుక్రవారం అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీల నుంచి ఎంపీడీవోల స్థాయి వరకు అధికారులంతా ఇండ్లకు నంబరింగ్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

సెక్రటరీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికించారు. ఈ స్టిక్కర్ పై యజమాని పేరు, ఇంటి నంబర్, వార్డు వివరాలు రాశారు. వీటి ఆధారంగా ఎన్యుమరేటర్లు నవంబర్ 9 నుంచి కుల గణన వివరాలు సేకరించనున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, కులగణన బాధ్యతను ప్రభుత్వం టీచర్లకు అప్పగించిన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టిక్కర్లు అంటించడం ఆపేయాలని పంచాయతీ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఉండబోతున్నారు. మూడు వారాలపాటు ఈ సర్వే చేయనున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లలో దాదాపు సగం, అంటే 40వేల మంది టీచర్లే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు కుల గణన సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో విద్యా శాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మొత్తం 80వేల మందిలో మెజార్టీగా టీచర్ల సేవలను వినియోగించుకుంటామని, వారితోపాటు తహసీల్దార్, ఎండీఓ, ఎంపీఓ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. స్కూళ్లలో బోధనకు ఇబ్బంది కలగకుండా ముసాయిదా రూపొందించామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహణ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందుగానే టీచర్ల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వేకు సంపూర్ణ మద్దతిస్తామని, తాము పాల్గొంటామని టీచర్ల సంఘాలు ప్రకటించాయి. అందుకు తగ్గట్టుగా టీచర్ల సేవలను వినియోగించుకునేలా ప్లాన్ రూపొందించారు.