భారత్ న్యూస్. హైదరాబాద్: అబ్కారీ భవన్‌లో వాల్మీకి జయంతి ఉత్సవాలు..

వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు

తొలి సంస్కృత కవిగా పిలువబ డే వాల్మీక మహాకవి తెలియనివారెవరు ఉండరని
ఎక్సైజ్‌ అడిషనర్‌ కమిషనర్‌ ఆజేయ్‌రావు అన్నారు. గురువారం అబ్కారీ భవన్‌లో పూర్ణిమ సందర్భంగా ఆక్టోబ రు 17న వాల్మీకి జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు.
ప్రభుత్వం అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించాలనే అదేశాల మేరకు కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బంది వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు అందరు పాల్గన్నారు.

అజయ్‌రావుతోపాటు రంగారెడ్డి డిప్యూటి కమిషనర్‌ దశరథ్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ అసిస్టేంట్‌ కమిషనర్లు ఆర్‌. కిషన్‌, అనిల్‌ కుమార్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గన్నారు.