..భారత్ న్యూస్ హైదరాబాద్….USA.
పేలిపోయిన బ్యాటరీ కంపెనీ…
అమెరికాలోని మిస్సోరీలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బ్యాటరీ వాహనాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది…