భారత్ న్యూస్. సికిందరాబాద్,:

ఫ్రంట్‌లైన్ సిబ్బందికి అసాధారణ సంఘటనలపై వర్క్‌షాప్ ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

  దక్షిణ మధ్య రైల్వే క్లెయిమ్స్ బ్రాంచ్ కమర్షియల్ డిపార్ట్‌మెంట్ మౌలా-అలీలోని  జోనల్ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఈరోజు అనగా  అక్టోబర్ 18, 2024లో అసాధారణ సంఘటనలపై వర్క్‌షాప్ను  నిర్వహించింది.  ఈ వర్క్ షాప్ లో ప్రయాణీకులకు మరణాలు/గాయాలకు దారితీసే అసాధారణ సంఘటనలతో వ్యవహరించడంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి అవగాహన కల్పించడమైనది. స్టేషన్ మేనేజర్లు అటువంటి సంఘటనలను నివేదించే సమయంలో క్రమబద్ధీకరించడానికి వర్క్‌షాప్‌లో ఒక ప్రామాణిక 'సందేశ ఆకృతి' విడుదల చేయబడింది. అలాగే కమర్షియల్ యాక్టివిటీస్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలు, తద్వారా సిస్టమ్‌కు రాబడి లీకేజీ కాకూడదు మరియు భద్రతా అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్యకలాపాలను నిర్వహించాల్సిన అవసరాన్నితెలియజేశారు.  ఈ వర్క్‌షాప్‌కు జోన్‌లోని దాదాపు 250 మంది స్టేషన్ మేనేజర్లు, లోకో పైలట్లు మరియు   రైలు మేనేజర్లు హాజరయ్యారు.
 ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ బి. నాగ్య  గారు      మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా హాజరయ్యారు. వర్క్‌షాప్‌ను చీఫ్ కమర్షియల్ మేనేజర్/క్లెయిమ్స్ శ్రీ రవి పి . పాడి గారు  నిర్వహించారు.