..భారత్ న్యూస్ హైదరాబాద్….కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు..!
సూర్యాపేట జిల్లా:- కోదాడ బైపాస్ కట్టకొమ్మగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి. వీరిలో నలుగురికి సీరియస్‌గా ఉండటంతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…