..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంమనోహర్‌ అనే విద్యార్థి క్యాంప్‌సలోని మెస్‌లో బిర్యానీ తింటుండగా చికెన్‌తో పాటు చనిపోయిన కప్ప కనిపించడంతో అందరూ నివ్వెరపోయారు.
వెంటనే క్యాంపస్‌, ఫుడ్‌సెఫ్టీ అధికారులకు ఎక్స్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. మెస్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పటివరకు సిబ్బందిపై ఏ చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థుల మండిపడుతున్నారు.