భారత్ న్యూస్ ..ఐద్వా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సారపాకలో ర్యాలీ కరపత్రాలు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ కాలనీ నుండి సారపాక సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఐద్వా సంఘం నాయకులు సరోజినీ, నాగమణి మాట్లాడుతూ ఈనెల 21 22 23 తేదీల్లో కొత్తగూడెంలో జరిగే ఐద్వా నాలుగవ మహాసభలను విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ ఐద్వా మహాసభ జాతీయ నాయకురాలు శ్రీమతి బృందా కారత్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి అరుణ జ్యోతి, తదితరులు పాల్గొని మహిళా సమస్యలపై చర్చించనున్నారు కావున బూర్గంపాడు మండలం నుండి అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు, ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా శాఖ కార్యదర్శి ఎస్ కే అబిదా , నిమ్మల పద్మ ,దాసరి రాధా, రేపాకుల లక్ష్మి ,సాధికా, సరస్వతి, శ్యామల ,లతా, తిరుపతమ్మ ,వెంకమ్మ, ఆదిలక్ష్మి ,సుభద్ర ,పద్మ ,పుష్ప తదితరులు పాల్గొన్నారు