…భారత్ న్యూస్ హైదరాబాద్….మానవతా ధృక్పథంతో ఆలోచించండి..” -టీజీఎస్పీ పోలీసుల డిస్మిస్ పై సర్కారుకు కూనంనేని విజ్ఞప్తి!
ప్రత్యేక పోలీసు కానిస్టేబుళ్లకు మట్టి పనులు చెప్పడం, అనధికారికంగా ఆర్డర్లీ సేవలకు వినియోగించడం వంటి విధానాలకు స్వస్తి పలకాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీఎస్పీ పోలీసులు చేస్తున్న ఆందోళనలను మానవతా ధృక్పథంతో అర్థం చేసుకొని డిస్మిస్ చేసిన 10 మందిని, సస్పెండ్ చేసిన 37 మందిని విధుల్లోకి తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. సివిల్ పోలీసుల మాదిరిగానే ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం అమలు చేయాలన్న ప్రత్యేక పోలీసు సిబ్బంది డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను పట్టించుకోకపోవడంతోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.