భారత్ న్యూస్.సికింద్రాబాద్;
సత్యనిష్ట మరియు బలమైన మేధోమదన ప్రక్రియతోనే
ప్రభుత్వ సంస్థల విజయం
- దక్షిణ మధ్య రైల్వే మాజీ జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా
• నిఘా అవగాహన వారోత్సవాన్ని పాటిస్తున్న దక్షిణ మధ్య రైల్వే
• ఈ సందర్భంగా 57 వ సంచిక విజిలెన్స్ బులెటిన్ ‘ అనిమిష’ విడుదల.
దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు -2024ను 28 అక్టోబర్ నుండి 3నవంబర్ 2024 వరకు నిర్వహిస్తోంది. ప్రస్తుత సంవత్సర నేపథ్యం “सत्यनिष्ठा की संस्कृति से राष्ट्र की समृद्धि” - " సత్యనిష్ట సంస్కృతితో దేశ ప్రగతి " పాటిస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు అనగా అక్టోబర్ 28 , 2024న దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు-2024 ప్రారంభ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే మాజీ జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్; దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగర్వాల్ మరియు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ జె .వినయన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ శాఖాధిపతులు, సీనియర్ అధికారులు మరియు సిబ్బంది చేత సత్యనిష్ట ప్రతిజ్ఞ చేయించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ గజానన్ మాల్యా గారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ మరియు అదనపు జనరల్ మేనేజర్‌తో కలిసి బులెటిన్ “అనిమిషా” 57 వ ఎడిషన్‌ను కూడా విడుదల చేశారు. ఈ బులెటిన్ దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా మాజీ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా మాట్లాడుతూ, జోన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు మరియు దక్షిణ మధ్య రైల్వే మొత్తం పనితీరును ప్రశంసించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జి.డి.పి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రపంచ దృష్టాంతంలో దేశంలోని సానుకూల వాస్తవాలు మరియు అవకాశాల గురించి ఆయన చర్చించారు. దేశం శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా వివిధ చర్యలపై కూడా ఆయన నొక్కి చెప్పారు. సుస్థిర అభివృద్ధి కోసం సంస్థల ప్రధాన విలువల ఆవశ్యకతను తెలియజేశారు. తన ప్రసంగంలో, ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ చేత అవినీతి అవగాహన సూచికతో చాణక్యుడి కాలం నుండి ప్రస్తుత ఆధునిక సాంకేతికతతో నడిచే ప్రపంచం వరకు విజిలెన్స్ ప్రాముఖ్యతను వక్కాణించారు. రోజువారీ పనిలో సమర్ధవంతమైన వృత్తినిపుణుల అత్యుత్తమ లక్షణాలతో రైల్వే వంటి ప్రభుత్వ సంస్థలో గణనీయమైన ఫలితాల కోసం సత్యనిష్ట, ఆలోచనా విధానాన్ని బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యత గురుంచి ఆయన క్షుణంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ప్రసంగిస్తూ, దక్షిణ మధ్య రైల్వే నిఘా విభాగం 3 నెలల పాటు జోన్ వ్యాప్తంగా ప్రివెంటివ్ విజిలెన్స్పై చేపట్టిన వివిధ అవగాహన కార్యకలాపాలను ఖచ్చితమైన ప్రణాళికతో చేపట్టిన కృషిని అభినందించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు-2024 ముందస్తుగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన “శిక్షణదారులకు శిక్షణ” విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో వివిధ శిక్షణా సంస్థల ప్రిన్సిపాల్స్, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్లు, ఇన్‌స్ట్రక్టర్లు మరియు శిక్షణా సంస్థలకు చెందిన సీనియర్ సూపర్‌వైజర్లు హాజరైనందుకు ఆయన అభినందించారు. రైల్వే పనితీరులో సత్యనిష్ట యొక్క ప్రాముఖ్యతను మరియు సమర్థవంతమైన వృత్తి నైపుణ్యంతో నిర్ణయాలు తీసుకోవడంలో నిజాయితీ, న్యాయబద్ధత, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని ఆయన హైలైట్ చేశారు. నైతికత మరియు వృత్తిపరమైన బాధ్యతతో నైతిక జీవితాన్ని గడపాలని ఆయన అందరినీ ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ, స్వచ్ఛతా-హై-సేవ మరియు విజిలెన్స్ అవగాహన ప్రచార కార్యక్రమాలతో పాటు వివిధ అవగాహన ప్రచారాల కోసం కార్యకలాపాలను నిర్వహించడంలో అన్ని ఎగ్జిక్యూటివ్ విభాగాలు మరియు విజిలెన్స్ శాఖ చేసిన కృషిని ప్రశంసించారు. సంస్థ యొక్క సమర్థత రోజువారీ పనిలో సత్యనిష్ట, నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. రో…