• జిల్లా సమీకృత కలెక్టరేట్ లో అంగ‌రంఘ వైభ‌వంగా సద్దుల బతుకమ్మ సంబురాలు. . . . .
  • ఆడబిడ్డలకు విశిష్టమైన పండుగ బతుకమ్మ

భారత్ న్యూస్.మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లా,

  • జిల్లా సమీకృత కలెక్టరేట్ లో అంగ‌రంఘ వైభ‌వంగా సద్దుల బతుకమ్మ సంబురాలు. . . . .
  • ఆడబిడ్డలకు విశిష్టమైన పండుగ బతుకమ్మ…….. DRO హరిప్రియ.
    మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లా స‌మీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో స‌ద్దుల బతుకమ్మ సంబరాలను గురువారం ఘ‌నంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ (ICDS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో జిల్లాలోని ఐసిడిఎస్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు.
    ఈ సంద‌ర్భంగా డిఆర్‌డిఓ (పిడి) సాంబ‌శివ‌రావు, జిల్లా సంక్షేమ అధికారి (డిబ్ల్యూఓ) కృష్టారెడ్డి, జిల్లా లా అఫీస‌ర్ చంద్రావ‌తి, బిసి వెల్ఫెర్ అధికారి వినోద్, క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ అధికారి గోపాల్‌రావు, ఇత‌ర జిల్లా అధికారులు, వివిధ శాఖ‌ల మ‌హిళ‌ల‌తో క‌లిసి జిల్లా రెవెన్యూ అధికారి హ‌రిప్రియ బ‌తుక‌మ్మ‌ల‌కు పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు.
    అత‌నంత‌రం బతుకమ్మల చుట్టూ క‌లెక్ట‌రేట్‌లోని ప‌లు శాఖ‌లకు చెందిన మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలకు కోలాటం చేస్తూ ఉత్స‌హాంగా నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుక‌ల‌లో పాల్గొన్న మ‌హిళల‌కు ప్ర‌సాదాలు, పండ్లు, మంచినీరు పంపిణి చేశారు.
    ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తెలంగాణ‌లో బతుక‌మ్మ‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌ని, ఆడ‌ప‌డుచుల‌కు ఎంతో పీతిపాత్ర‌మైన పండుగ‌ని పేర్కొన్నారు. కలెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏడు రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహాలతో మ‌హిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మహిళా ఉద్యోగులకు స‌ద్దుల‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అంతా మంచే జ‌రుగాల‌ని ఆమే అకాంక్షించారు. స‌మీకృత క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏడు రోజుల పాటు బ‌తుక‌మ్మ సంబురాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించుట‌లో రెవెన్యూ శాఖ‌లో ప‌నిచేస్తున్న తాటికొండ సంతోష్ కుమార్ కీల‌క పాత్ర‌పోషించారు.