.భారత్ న్యూస్. సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా 31.10.2024న
పదవి విరమణ పొందిన శ్రీ బి. నాగ్య గారు
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ బి. నాగ్య గారు 31 అక్టోబర్ 2024 నాటికి పదవీ విరమణ వయస్సును పూర్తిచేసిన సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ పదవి విరమణ పొందినారు.
వారు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ వాస్తవ్యులు. ఎన్.ఐ.టి /వరంగల్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ మరియు ఐ.ఐ.టి./ఢిల్లీ నుండి ఎమ్.టెక్ ను విజయవంతగా పూర్తి చేశారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 1989 బ్యాచ్‌కు చెందిన వీరు 1991 సంవత్సరంలో 15 సెప్టెంబర్‌న రైల్వే సేవలో ఉద్యోగ ప్రస్థానం చేశారు. భారతీయ రైల్వేలో 33 సంవత్సరాలపాటు విజయవంతమైన సేవలను అందించారు.
రైల్వేలో 33 సంవత్సరాల ప్రయాణంలో వారు పూర్ణ,రామగుండం మరియు భద్రాచలం రోడ్ మొదలైన ప్రాంతాలలో ఏరియా ఆఫీసర్ గా; కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బల్లి లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా ; గుంతకల్లు మరియు పాల్ఘాట్ డివిజన్ లలో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా; సికింద్రాబాద్ లో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్/ఫ్రైట్/; హుబ్బల్లి లో చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ గా ; మరియు భువనేశ్వర్లో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా మొదలైన వివిధ హోదాల్లో తన భాద్యతలను నిర్వర్తించారు.
హుబ్బల్లి లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ గా భాద్యతలను నిర్వహించే సమయంలో అత్యంత కష్టతరమైన కాజిల్ రాక్ నుండి కులెం వరకు రైళ్లకు ఘాట్ క్లియరెన్స్‌ను విజయవంతగా నిర్వహించేవారు. ఈ విభాగాన్ని మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కి మార్చినప్పుడు, ఘాట్‌పై ఇనుప ఖనిజం తరలింపుపై భారీ ఒత్తిడి ఏర్పడింది మరియు ఖాళీలను తిరిగి లోడింగ్ పాయింట్‌లకు తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఇబ్బందులు మరియు కఠినమైన పని ఉన్నప్పటికీ, దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా హుబ్లి డివిజన్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఆపరేటింగ్ షీల్డ్‌ను పొందింది. ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్/ఫ్రైట్ గా సేవ చేయడానికి పూర్వం గుంతకల్లు డివిజనల్ లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా సేవలను అందిస్తుండేవారు.

.