భారత్ న్యూస్ హైదరాబాద్….వరి బోనస్‌కు ఇన్ని ఆంక్షలా!

ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు పంట బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు.

ఇప్పుడు సన్న వడ్లలో కేవలం 33 రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని.. గింజ పొడవు 6మిల్లీ మీటర్లు, వెడల్పు 2మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదని, తేమశాతం 17కంటే తక్కువ ఉండాలని కొర్రీలు పెట్టడంతో రైతులు అయోమయంలో ఉన్నారు.

దీంతో రైతులు బోనస్ కోసం చూసుకుంటే.. వర్షం పడితే ఉన్న పంటకు నష్టం అవుద్దని బయట ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారు…