భారత్ న్యూస్ హైదరాబాద్…గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థత అయిన విద్యార్థినుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
శుక్రవారం వరకు 45 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, శనివారం రోజు మరో 15 మంది ఆస్పత్రిలో చేరారు.
వీరిలో శైలజ అనే విద్యార్థిని పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
పార్వతి అనే విద్యార్థినిని కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి, కోవ లక్ష్మిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు….